Friday, 4 November 2016

telugu bhasha goppadanam

                                                   తెలుగు భాష గొప్పదనం 
                      ***********************
  తెలుగు భాష లోని కమ్మదనం 
తెలుగు భాషలోని తియ్యదనం 
అనుభవించావోయ్ ఓ విద్యార్థి 
తెలుగు భాష అని చులకన చేయక 
తెలుగు భాషను తేనెలొలుకు భాషగా 
మకరo ద బృంద రస రమ్య మైన భాష 
గౌరవింపవోయ్ ఓ విద్యార్థి 
తెలుగు భాష చులకనని పరాయి భాషకు వె ళ్ల కు 
తల్లిపాలు కు దాది పాలకు వ్యత్యాసం గుర్తించు 
అభిమానించు ఓ విద్యార్థి  ఆరాధించు ఓ విద్యార్థి 
గమనించవోయ్ తెలుగు ఖ్యాతి చాటింపవో య్ ఓ విద్యార్థి  

Thursday, 3 November 2016

mana palleturu kavitha

                                          మన పల్లెటూరు 
                    ****************
చూడవోయ్ చూడవోయ్ మా పల్లె ప్రకృ తి  అందాలను 
చూసి తిలకించావోయ్ మా అనురాగాల హరివిల్లును 
చెప్పనా చెప్పనా మా పల్లెటూరి ముచ్చట్లు 
చెవులారా వినండి మనసారా ఆనందించండి 
పచ్చని పొలాలతో వెలసిన అందాల మా పల్లెటూరు 
అందమైన పొలాలతో నిండిన మా పల్లెటూరు దేశానికి పట్టుగొమ్మ మా పల్లెటూరు పక్షుల కిల కిల రావాలా మారుమ్రోగే మాపల్లెటూరు పచ్చని చెట్లతో నిండిన మా పల్లెటూరు 
ప్రకాశం వంతమైన జీవితాన్ని గడుపుతున్న మా రైతన్న నీటి నిజాయతి కలవారు మా పల్లెల్లో జీవిస్తున్నారు 
సంసృ తి కి నిలయాలు మా పల్లెటూర్లు  
దేశమనే చిరాకు అందమైన గురుతులు మా పల్లెటూర్లు 
పండగ రోజు ఇంటింటి లో రంగవల్లులు తో అలరారే మా పల్లెటూర్లు 
మా పల్లెటూరికి చూచి అందిచావోయ్  అందించావోయ్ 
ఇదే ఇదే మా పల్లెటూరు ఇదే ఇదే మా అందాల ఊ రు 

mana palleturu

                                           తెలుగు ప్రాజెక్ట్ 
                    ******************
                        పల్లెటూరు 
                     **************
 ఉ పో ద్ఘాతము :మా ఉపాధ్యాయిని చెప్పినట్లుగా పల్లెటూరు గురించిన చిత్రాలు సే కరించి దాని యొక్క ప్రాముఖ్యతను ప్రకృ తి  అందాలను క్రింది విధంగా వివరించబోతున్నాను . 

విషయవిశ్లేషణ : పల్లెటూరు ప్రక్రుతి అందాలకు పుట్టినిల్లు ప్రొద్దున్నే పక్షుల కిలకిలా రావాలు, కోలా కు హు కు హురాగాలు ప్రక్రుతి ఎంతో  అందంగా అనిపిస్తుంది పిల్లలు ఆటలాడుతూ సంతోషంగా ఆడుతారు కష్టజీవి 
కష్టానికి భూమి పులకిస్తుంది. కష్టజీవిలేనిదే సమాజం లేదు . రాత్రి అన క పగలు అన క కష్టపడి ,పంటవేసి తేళ్లకు పాములకు తనశరీరాన్ని అప్పగించి ,నీరుపెట్టి నారు పోసి కష్టాలను అనాధలుగా చేసుకొని పండిస్తున్నరైతు కు కన్నీళ్లే మిగులుతున్నాయి .పల్లెలో కష్టమొచ్చినా అందరు ఒకరికి ఒకరు సహాయం చేసుకొంటూ ధైర్యం చెప్పు కొంటూ జీవిస్తారు .పల్లె జీవితం హరివిల్లు లాంటిది.. 

                                     ప్రతిరోజూ పొలాల్లో పాటలు పడుచు కష్టాలను మరచి పనులు చేసుకుంటారు. దేశానికి పల్లెటూర్ల్ పట్టుకొమ్మలు .పల్లెలేనిదే దేశంలేదు .దేశానికి సిపాయి ఎంత ముఖ్యమెనవారో రైతు అంటే ముఖ్య మైనవాడు . 

సంస్కృతీ సంప్రదాయాలు :ఇక పండగల విషయానికి వస్తే అందరు ఒకచోట చేరి చాల అందంగా జరుపుకుంటారు .సంప్రదాయబద్దంగా దుస్తులను ధరించి పూజలు ఉపవాసంతో చేసి పెండివంటలు చేసి బంధువులనుఇళ్ల కు పిలుచుకొని అందంగా జరుపుకుంటారు .సంస్కృతీ సంప్రదాయాలు కనుమరుగవుతున్న ఈరోజుల్లో మా సంప్రదాయాలను కొంత కాపాడుతున్నది పల్లెటూరు . 
                     
            రైతు :  పంటను కౌలుకు తీసుకొని పంట పండించి ధాన్యం రాసులుగా పోసి  తమకడుపులు కాలుతున్న కన్నీళ్లు కారుతున్న ఎన్నందారులకు ఫలితం అంత అప్పగించి వట్టిచేతులతో ఇంటికిపోయి అప్పులు తీర్చలేక ఇంటిలోనివారికి అన్నం పెట్టలేక బ్రతకలేక ఆత్మహత్యలు చేసుకొంటున్న రైతన్న దీనగాథ ఎవరు వింటారు 

ప్రకృతి :     అక్కడ పారె సెలయేరు సవ్వడులు      ,లేగదూడల చెంగుచెంగులు ,గోధూళి వేళా ప్రజల అనుబంధాలు ఆప్యాయతలు చెప్పడంకన్నా చూడడమే బాగుంటుంది 

ముగింపు :పల్లె టూరు సుభిక్షంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది .అక్కడి రైతన్నకు ప్రభుత్వ సహాయం పూర్తిగా అందుతూ ప్రకృ తి  వైపరీత్యాలు లేకపోతె చాలాబాగుంటుంది పల్లెటూర్లు కన్నీళ్లు పడుతున్నాయి పల్లెలుఅంతరించిపోతున్నాయి నాగరికతవైపు అడుగులు వేస్తూ పల్లెలు వాడాలి పట్టణాలకు వలసలు వస్తున్నారు వలసలు ఆపాలి ఆర్థికంగా ముందున్న కొందరు పల్లెలను దత్తత తీసుకొని అభివృదిచేయాలి .వారికీ వ్యవసాయంలో టెక్నాలిజీ గురించి అవగాహనా కలిపించాలి పల్లెలను అభివృద్ధి పరచాలి . 
ప్రాజెక్టు పై న అభిప్రాయం :పల్లెటూరి గురించి ప్రక్రుతి గురించి తెలుసుకొని ,రైతు దీనస్థితి తెలుసుకోగలిగాను ప్రక్రుతి అందాల గురించి సంప్రదాయాల గురించి తెలుసుకోగలిగాను. పల్లెలను అభివృద్ధి చేయడం మన అందరి భాద్యత అనితెలుసుకోగలిగాను